Saturday, November 8, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఓవర్‌లోడ్‌పై రవాణా శాఖ దృష్టి

ఓవర్‌లోడ్‌పై రవాణా శాఖ దృష్టి

- Advertisement -

కేసులతోపాటు వాహనాల సీజ్‌
ఏడాది కాలంగా కసరత్తు
అయినా కొలిక్కిరాని సమస్యలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

రాష్ట్రంలో రవాణా శాఖ గత ఏడాది కాలంగా వాహనాల ఓవర్‌లోడ్‌ సమస్యపై దృష్టిసారించింది. పలు రకాలుగా కసరత్తు చేస్తున్నా, ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ, ప్రయివేటు వాహనాల్లో ఓవర్‌లోడ్‌ ఇబ్బందులు ఉన్నాయి. చట్టాలు ఎన్నీ ఉన్నా అమలు కావడం లేదు. నిబంధనలు, మార్గదర్శకాలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. ఓవర్‌లోడ్‌ మూలంగా వాహనాలు దెబ్బతిన డమేగాక సాధారణ ప్రజలు, ప్రయాణీకుల ప్రాణాలకు ముప్పు ఎదురవుతున్నది. జాతీయ క్రైమ్‌ బ్యూరో రికార్డు(ఎన్‌సీఆర్‌బీ)ల నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాలకు గురై మరణించేవారే అత్యధికంగా ఉంటున్నారు. ఈసమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషి పెరగాల్సిన అవసరం ఉంది. చట్టాలను కఠినతరం చేయడం తోపాటు వాహనాల నిర్వహణపై కీలకంగా దృష్టిపెట్టాల్సిన అవసరం కనిపిస్తున్నది. వ్యక్తిగత, పారిశ్రామిక, వ్యవసాయ తదితర వాహనాలు ఉన్నాయి. వీటిపై అటు యాజ మానులు, ఇటు సర్కారుకు పర్యవేక్షణ తక్కువ. ఫిట్నెస్‌ తనిఖీలు అసలు జరగక పోవడం, అడపాదడపా జరిగినా నిర్లక్ష్యంతో వదిలేయడం మూలంగా సమస్యలు పెరుగుతు న్నాయి. రాష్ట్ర రవాణా శాఖ గత సంవత్సరం కాలంగా ఓవర్‌లోడ్‌ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నది. నిబంధ నలను ఉల్లంఘించి రోడ్లపైకి తేచ్చే వాహనాలపై కేసులు పెడుతు న్నది. సీజ్‌ చేస్తున్నది. ఈ ఏడాది కాలంలో 1.15 లక్షల కేసులను వాహనాలపై పెట్టింది. ఇందులో ఓవర్‌లోడ్‌తో రోడ్లపై తిరుగు తున్నవి, ఫిట్నెస్‌ లేనివి, పన్నుకట్టనివి, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బీమా లేని వాహానాలు ఉన్నాయి. అధిక బరువు కలవి 5000 వరకు ఉన్నట్టు అధికారిక సమాచారం. అలాగే ప్రయివేటు బస్సులు మరో 9000 వరకు ఉన్నట్టు రవాణా శాఖ గుర్తించింది. ఈతరహా వాహనాలతో అనేక సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి .బరువు విషయంలో నిబంధనలేవీ అమలుకావడం లేదు. లైట్‌మోటార్‌ వాహనాల 7000 కిలోలు, లైట్‌ కమర్షియల్‌ వాహనాలైతే 3500 కిలోల నుంచి 7500 కిలోల వరకు, భారీ వాణిజ్య వాహనాలైతే 7500 కిలోలపైన బరువు తీసికెళ్లోచ్చు. అయితే ఈ బరువు మన రహదారుల భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఓవర్‌లోడ్‌తో రోడ్లపై ఒత్తిడి పెరిగి త్వరితగతిన పాడవుతున్నాయి.ఓవర్‌లోడ్‌తో భద్రతా సమస్య లు ఉత్పన్న మవుతున్నాయి.వాహనాల టైర్లు, బ్రేకులు, సస్పెన్షన్‌ ప్రభావం పడుతున్నది .బ్రేకులు ఫెయిలై ప్రమాదాలు జరుగుతు న్నాయి. డీజిల్‌, పెట్రోల్‌ వినియోగం పెరగడమేగాక, మైలేజీ తగ్గుతున్నది. అంతేగాక నిర్వహణా ఖర్చు తడిసిమో పెడవుతున్నది. చట్టపరమైన జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. బీమా క్లెయిమ్‌ లను తిరస్కరిస్తారు. చెల్లింపులు జరగవు. గ్రావీటి తగ్గి వాహనం కంట్రోల్‌ కాదు. అప్పుడే రోడ్లు ప్రమాదాలకు అవకాశముంటుంది. ఇంజిన్లు తరచూ రిపేర్‌కు వస్తాయి. రోడ్డు ప్రమాదమేగాక అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. సస్పెన్షన్‌, బ్రేకులపై ఓత్తిడి పెరిగి వాహనం క్రమేణా తీవ్ర మరమ్మత్తులకు గురవు తుంది. పదే పదే స్పేర్‌పార్టులు మార్చుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్‌ నిబంధన లను సైతం ఉల్లంఘించినవారవుతారు. ఓవర్‌లోడ్‌ మూలంగా మోటారు వాహ నాల చట్టంలోని 144, 1988 ప్రకారం రూ. 20 వేల జరిమాన విధించే అవకా శముంది. ఓవర్‌లోడుతో ఇంజిన్‌లో బాగా వేడి పెరిగి ట్రాన్స్‌మిషన్‌ సమస్య లు తలెత్తు తాయి. ఇకపోతే మోటారు వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోతే ప్రాణాలకే ప్రమాదముంటుంది.ౖ ఒత్తిడి పెరిగి త్వరగా దెబ్బతింటాయి. అప్పుడూ రోడ్డు ప్రమాదాలు జరుగు తుంటాయి. రవాణా, నిర్వహణ ఖర్చులు ఎప్పటికప్పుడు అధికమవుతూ ఉంటాయి. రవాణా శాఖ చర్యలూ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -