Saturday, November 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు..

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌- హైద‌రాబాద్ : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం తెల్లవారుజామున సుద్దపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. అదుపుతప్పిన బస్సు డివైడర్‌ పైకి దూసుకెళ్లి ఆగింది. దీంతో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నిజామాబాద్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -