– వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్
నవతెలంగాణ-చందానగర్
హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెల్లరీలో దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ శనివారం మీడియాకు వెల్లడించారు. బీహార్‌కు చెందిన దోపిడీదారులు హైదరాబాద్‌లోని బంగారం, వజ్రాల ఆభరణాల దుకాణాలను తుపాకీలతో దోచుకోవాలని ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో వెల్డింగ్ కార్మికుడైన వారి సహచరుడు దీపక్‌కుమార్ సాహౌ సహాయంతో జులైలో జీడిమెట్లలోని అస్బె స్టాస్ కాలనీలో ఒక ఇల్లును అద్దెకి తీసుకున్నారు. రెండు సెకండ్‌హ్యాండ్ బైకులను కొనుగోలు చేశారు. కొన్ని రోజులుగా చందానగర్‌లోని షోరూంలను పరిశీలించారు. చివరకు ఖజానా జ్యువెల్లరీని ఎంచుకొని దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో ఆశిష్ కుమార్‌సింగ్‌ను అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు వీరికి వాహనాలను ఏర్పాటు చేసిన దీపక్‌కుమార్ సాహూను కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి దాదాపు 900 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా ఏడు మంది దోపిడీకి పాల్పడినట్టు తెలిపారు. వీరిపై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో యుఎస్/11 (2), 115(2), 127(2), 324(3), 310(2), 351(3) బిఎన్‌ఆర్ ఆర్/డబ్ల్యూ సెక్షన్ 25(1-బి), 27(1) ఆయుధ చట్టంలో 890/ 2025లో కేసు నమోదు చేశారు. అభరణాల దుకాణాల నిర్వహణ సంస్థలు పనివేళలో తగిన భద్రత యంత్రాంగాన్ని కలిగి ఉండాలని డీసీపీ సూచించారు. దుకాణాల వద్ద చొరబాటు అల్లారం పానెల్‌ను కలిగి ఉండాలని తెలిపారు. ఎస్‌ఓటీ, సీసీఎస్, ఎల్ అండ్‌ఓ సిబ్బంది సమిష్టి కృషితో దొంగలను అరెస్టు చేసినట్టు వివరించారు. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.
ఖజానా జ్యువెల్లరీ చోరీ నిందితుల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES