Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వ్యాధి తీవ్రతను బట్టి వైద్యం..

వ్యాధి తీవ్రతను బట్టి వైద్యం..

- Advertisement -

యం.డి. (జనరల్. మెడిసిన్) డియం (న్యూరాలజి) కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి శ్రీపాదరావు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: బ్రెయిన్ ట్యూమర్కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి వైద్యం చేస్తామని యం.డి. (జనరల్. మెడిసిన్) డియం (న్యూరాలజి) కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ సాయి శ్రీపాదరావు తెలిపారు. ఎక్కువగా రెండో దశలోనే వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వడమా, శస్త్ర చికిత్స చేయడమా అన్నది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎమ్మారై స్కాన్ చేయడంతో ట్యూమర్ను నిర్ధారిస్తున్నాం. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో స్కానింగ్లు అందుబాటులోకి రావడంతో వ్యాధిని త్వరగా గుర్తించగలుగుతున్నాం.  బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్ ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనానా అని తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశలో వ్యాధిని గుర్తించేవారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వసెస్ అందుబాటులోకి రావడంతో మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నాం. లక్షణాలను బట్టి స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు.ఒకసారి సమస్య నిర్ధారణ జరిగాక చికిత్స అన్నది కేవలం ఒక స్పెషలిస్టు డాక్టరుతో కాకుండా అనేక రకాలుగా (మల్టీ డిసిప్లినరీ అప్రోచ్) జరగాల్సిన అవసరం ఉంటుంది. మందులతో పాటు మెదడులో గడ్డ ఉన్న ప్రాంతాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలూ అవసరమవుతాయి. ఒకవేళ శస్త్రచికిత్స చేయాల్సి వస్తే మెదడులో గడ్డ ఎలాంటి ప్రాంతంలో ఉంది, దానికి శస్త్రచికిత్స చేసే సమయంలో ఏయే వ్యవస్థలు ప్రభావితమయ్యే అవకాశముంది. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad