నవతెలంగాణ – అశ్వారావుపేట
సకాలంలో రోగ నిర్ధారణతో చికిత్స సులభతరం అవుతుందని గుమ్మడి వల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మధుళిక అన్నారు. చిన్నారులకు తప్పనిసరిగా సికిల్ సెల్ అనీమియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలని సూచించారు.
మంగళవారం మండలంలోని బచ్చువారిగూడెం లో గల అంగన్వాడీ కేంద్రం లో ఐదేళ్ల లోపు చిన్నారులకు సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గల 75 మంది ఛిన్నారులకు ఈ పరీక్షలు చేశారు. అనంతరం వైద్యురాలు మాట్లాడుతూ ఈ వ్యాధి నివారణ అవగాహన తోనే సాద్యమని, ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సౌజన్య, ఏఎన్ఎం స్వరూప, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.



