Wednesday, July 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాతృ మరణాలు జరగకుండా చికిత్స అందించాలి: కలెక్టర్

మాతృ మరణాలు జరగకుండా చికిత్స అందించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
 జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి గర్భిణీలకు తగు సూచనలు, సలహాలు, చికిత్స అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  హనుమంత రావు వైద్య ఆరోగ్యశాఖ వైద్యులను, సిబ్బంది కి ఆదేశించారు. మంగళవారం రోజు  కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో అయన పాల్గొని  సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.

గర్భిణీ స్త్రీల ( జనన పూర్వ  సంరక్షణ సేవలు) మెరుగుపరచాలని, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పై ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఫాలో అప్ చేయాలన్నారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి వారి వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.  జిల్లాలో జరిగిన మాతృ మరణాలలో 52 మాతృ మరణాలపై సమీక్ష జరిపారు.జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు , సిబ్బంది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరైన సమయంలో చికిత్సలు అందించి ఇకముందు మాతృమరణాలు జరగకుండా చూడాలని ఆదేశించారు.   గర్భిణీ స్త్రీలకు సకాలంలో వ్యాక్సినేషన్ కూడా నిర్వహించాలని కోరారు.

ఏఎన్ఎం, ఆశా గృహ సందర్శన చేసి గర్భిణీ స్త్రీల నమోదు సకాలంలో చేసి వారికి వ్యాక్సినేషన్, మరియు మాత్రలు, చికిత్సలు అందించాలని ఆదేశించారు.  హై రిస్క్ కేసులను సకాలంలో గుర్తించి గర్భిణి సమయంలో , కాన్పు సమయంలో ఇబ్బంది కలగకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండేటట్టు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,  అవసరమైతే కాన్పు కోసం రిఫరల్ ఆసుపత్రికి పంపాలని సూచించారు. యూపీహెచ్ సి లో గల సిబ్బంది మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎం,ఆశా వర్కర్లు గర్భవతుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని తగు సూచనలు, సలహాలు , చికిత్స అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగేలా గర్భిణీ స్త్రీలపై ప్రేమ, ఆప్యాయతతో మాట్లాడాలన్నారు. సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీ  అయ్యేలా చూడాలన్నారు.

హై రిస్క్ కేసులను సకాలంలో గుర్తించి సరైన సమయంలో చికిత్స అందించి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి అన్నారు.జిల్లాలో అమ్మకు భరోసా కింద  గర్భవతులైన  వారికి న్యూట్రిషన్ కిట్స్ అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. స్త్రీ,వైద్య నిపుణులు కవిత, నిర్మల, గర్భవతులకు అందిస్తున్న ప్రసవానికి ముందు, ప్రసవానంతర సేవల గురించి సూపర్వైజర్లకు, ఏఎన్ఎం, ఆశ వర్కర్లకు,  వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా మనోహర్ , స్త్రీ వైద్య నిపుణులు (గైనకాలజిస్టులు) డాక్టర్ నిర్మల, డాక్టర్ కవిత, పిల్లల వైద్య నిపుణులు డా,, కరణ్ రెడ్డి, డా,, మోహన్, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ రెహమాన్, డిప్యూటీ వైద్య శాఖ అధికారి యశోద, డా,, శిల్పిని, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రామకృష్ణ రావు లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -