నవతెలంగాణ – తొగుట : జీవకోటికి ప్రాణదారం చెట్లని ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తుక్కా పూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నర్సింగ రావు, గ్రామ అధ్యక్షులు బర్రెంకల స్వామితో కలిసి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ప్రాణికి జీవనాధారం చెట్లని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రకృతిలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. మొక్క నాటడమే కాకుండా వాటిని రక్షించే బాధ్య త కూడా మనమే తీసుకోవాలని అన్నారు. నేడు నాటిన మొక్కలు భవిష్యత్తులో వృక్షాలుగా ఎదిగి ప్రతి ప్రాణికి జీవనాధారంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిక్కు డు గోపాల్ ముదిరాజ్, గ్రామ ప్రజలు, గ్రామ పంచా యతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జీవకోటికి ప్రాణధారం చెట్లు: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES