Wednesday, February 18, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో ట్రెడెన్స్‌ భారీ విస్తరణ

హైదరాబాద్‌లో ట్రెడెన్స్‌ భారీ విస్తరణ

- Advertisement -

2027 నాటికి 2,200 ఉద్యోగాల లక్ష్యం
హైదరాబాద్‌ : ప్రముఖ డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సంస్థ ట్రెడెన్స్‌ హైదరాబాద్‌లోని నానకరామ్‌గూడలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త డెలివరీ, ఆవిష్కరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బయోఏషియా 2026 వేదికగా ఆ సంస్థ ఈ ప్రకటన చేసింది. ఇది తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌కు ఊతమిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రతిభా వనరులను ఉపయోగించుకుంటూ లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌కేర్‌, రిటైల్‌ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఎఐ పరిష్కారాలను అందించడమే ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చేపట్టిన ఈ విస్తరణ ద్వారా ప్రస్తుతం ఉన్న 400 మంది ఉద్యోగుల సంఖ్యను 2027 నాటికి 2,200కు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని ట్రెడెన్స్‌ సిటిఒ సుమిత్‌ మెహ్రా తెలిపారు. ఇందులో భాగంగా 2026లోనే సుమారు 700 కొత్త ఉద్యోగాలను కల్పించనున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -