- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ‘ఆపరేషన్ సిందూర్’పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించాయి. ఇందులో విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు వెల్లడించారు. ‘‘ఉగ్రమూకలకు పాకిస్థాన్ అండగా నిలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనక టీఆర్‌ఎఫ్ ఉంది. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారు. లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌పై ఇప్పటికే నిషేధం ఉంది. వీటిపై నిషేధం దృష్ట్యా టీఆర్‌ఎఫ్ పేరుతో కార్యకలాపాలు చేస్తున్నారు. పాక్ ఉగ్రమూకల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేం’’ అని విక్రమ్ మిస్రీ తెలిపారు.
- Advertisement -