నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో శనివారం ఆదివాసీ నాయక్ పోడు సంఘం, యూత్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం పురస్కరించుకొని వేడుకలను నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయకుడు సంఘం మండల అధ్యక్షులు పెద్ది నారాయణ మాట్లాడుతూ నాయక పోడుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో ప్రాధాన్యత నివ్వాలన్నారు.ఆదివాసులకు ప్రభుత్వం మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసులకు అండగా నిలబడిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.కార్యక్రమంలో కుల సంఘం అధ్యక్షులు పెద్ది ప్రభాకర్, సభ్యులు చిరంజీవి, గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సతీష్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్, శ్రీకాంత్, గంగాధర్, సృజన్, కుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
హాస కొత్తూర్ లో ఆదివాసి దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES