నవతెలంగాణ – పాలకుర్తి
అప్పుల బాధ భరించలేక గిరిజన రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని సిరిసన్న గూడెం శివారు కంబాలకుంట తండాలో మంగళవారం చోటుచేసుకుంది. పాలకుర్తి ఎస్ఐ ఎండి యాకూబ్ హుస్సేన్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కంబాలకుంట తండాకు చెందిన బానోతు బిక్య 57, పంటలకు పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో పంటలకు గిట్టుబాటు ధర లేక, చేసినా అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురై ఈనెల 13న తన వ్యవసాయ బావ వద్ద పురుగుల మందు తాగాడని తెలిపారు. పాలకుర్తి, తొర్రూర్లలో చికిత్స పొందాడని, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తరలించారని అన్నారు. చికిత్స పొందుతూ బిక్య మృతి చెందాడని అన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని అన్నారు. మృతుడి కుమారుడు సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై యాకూబ్ హుస్సేన్ తెలిపారు.
అప్పుల బాధతో గిరిజన రైతు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES