Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్భక్తిశ్రద్ధలతో ఆదివాసీల నోవొంగ్ పూజలు..

భక్తిశ్రద్ధలతో ఆదివాసీల నోవొంగ్ పూజలు..

- Advertisement -

నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండలంలోని  చింతలస్వాంగి గ్రామ శివారులో గురువారం సిడాం పరివారం ఆధ్వర్యంలో నోవోంగ్ (కొత్త పంటల)  ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో  నిర్వహించారు. శ్రావణ మాసంలో గోండు గూడాలలో  కొత్త పంటలతో ఈ నోవొంగ్ ప్రత్యేక పూజలు చేయడం ఆదివాసి గోండు తెగల వారి అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయం అని సిడాం శంభు హన్మంతులు వివరించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వేసిన పంటలు, ధాన్యాలు కూరగాయలను తమ పెర్సాపేన్, సతీక్ దేవుళ్ళకు సమర్పించి సామ బియ్యం, నెయ్యితో వండిన ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో భూమన్న, లక్ష్మణ్, జంగు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad