- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యాశాఖ అశ్వారావుపేట మండల విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీకి ఘన నివాళి అర్పించారు. అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటని మండల విద్యాధికారి పి.ప్రసాదరావు అన్నారు. జయజయహే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లిని కీర్తిస్తూ వ్రాసిన గీతం తెలంగాణ ప్రజలందరి హృదయాలలో నిలిచిపోతుందని అన్నారు. మానవ విలువలు కనుమరుగవుతున్న తీరును వివరించిన పాట అందరికి కనువిప్పు కలిగించిందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త సిద్ధాంతపు ప్రభాకరాచార్యులు, సి.ఆర్.పిలు రామారావు, రాజు సోమరాజు, మల్లేశ్వరరావు, జ్యోతి , కార్యాలయ సిబ్బంది మహబూబ్, రమేష్, ఐఇఆర్.పిలు రామారావు, లక్ష్మి పాల్గొన్నారు.
- Advertisement -



