Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కు సన్మానం 

బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
బ్రాహ్మణ కొత్త పెళ్లి సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ ను ఘనంగా సత్కరించినట్టు నాగారం గ్రామానికి చెందిన బొబ్బల ముత్తయ్య తెలిపారు. సోమవారం ఆ గ్రామ గ్రామపంచాయతీ లో బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా సర్పంచ్ గా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామానికి యాకాంతం గౌడ్ ఎన్నికవ్వడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటించినట్లు తెలిపారు. ఆయన చేసిన సేవలు ఆ గ్రామస్తులు గుర్తించి అతన్ని గెలిపించాలని అన్నారు. గ్రామంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించి ప్రజాదరణ పొందిన వ్యక్తి కావున అతని గెలుపుకు గ్రామస్తులు కృషి చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతూ మా పక్క గ్రామాన్ని కూడా సహకరించాలని కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, చిర్రా బోయిన కుమార్, నాయని కొమరయ్య, ఉడత వెంకన్న, తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -