- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామ నూతన సర్పంచ్ గా అరేటి రఘు ను మాజీ ఎంపీపీ బాదావత్ రమేష్ నాయక్, బిఆర్ ఎస్ ఇందల్ వాయి మండల అధ్యక్షుడు చిలివేరి గంగా దాస్ లు సోమవారం చంద్రయాన్ పల్లి గ్రామంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ అరేటి రఘు ఆధ్వర్యంలో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరేటి రఘు పై ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సొసైటీ డైరెక్టర్ రామ్ రెడ్డి ఉన్నారు.
- Advertisement -



