- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ జానపద దినోత్సవం సంధర్బంగా ప్రముఖ సీనియర్ జానపద కళాకారుడు బల్లి సురేందర్ కు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ భూపాలపల్లి జిల్లా చైర్మన్, ఈజిఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,కాటారం మాజీ ఎంపిపి పంథకానీ సమ్మయ్య లు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మన సాంస్కృతి, సాంప్రదాయాలను యావత్ ప్రపంచానికి జానపదాలు చాటుతున్నాయన్నారు.జన జీవన వైవిద్య విధానమే జానపధాలని పేర్కొన్నారు. స్థానిక జాన పద కళాకారులను అందరూ ఆధరించి ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు విస్లావత్ దేవన్,రామ్నారాయణ పాల్గొన్నారు.
- Advertisement -