- Advertisement -
నవతెలంగాణ – నకిరేకల్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నకిరేకల్ లో లయన్స్ క్లబ్ పూర్వ జోన్ చైర్మన్ రావిరాల అశోక్, లయన్స్ సెంటినీయల్ క్లబ్ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. చేనేత ను నిలబెట్టేందుకు నిరంతరం పరిశ్రమిస్తున్న చేనేత కార్మికులు చిట్టిపోలు యాదగిరి, బోనగిరి సుదర్శన్, భువనగిరి ప్రమీల, సుంకి నరసింహస్వామి, ముషం నాగలక్ష్మి తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ జోన్ చైర్మన్ రావిరాల అశోక్, లయన్స్ సెంటినియల్ క్లబ్ అధ్యక్షుడు కందాల ప్రేమనాథరెడ్డి, కార్యదర్శి కందాల వెంకటరెడ్డి, శేఖర్ శెట్టి, రామ్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -