నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని ఐకెపి మండల సమైక్య భవనంలో బుధవారం కమ్మర్ పల్లి పంచాయతీ పాలకవర్గం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఐకెపి ఎపిఎం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ లతోపాటు వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ ద్వారా ఎల్లవేళల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో నూతనంగా నాలుగు గ్రామ సమైక్యల భవన నిర్మాణం కోసం స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. స్థల సేకరణ కోసం తహసిల్దార్ తో మాట్లాడి స్థల కేటాయింపు జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధిలో మహిళా సంఘాల సహకారం ఉండాలని ఈ సందర్భంగా సర్పంచ్ హారిక అశోక్ కోరారు. ఈ కార్యక్రమంలో సీసీలు నవీన్ కుమార్, పీరియ నాయక్, అలేఖ్య, గంగా లలిత, అన్ని గ్రామ సంఘాల పదాధికారులు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్ పల్లి పంచాయతీ పాలకవర్గానికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



