Thursday, October 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లలితమ్మకు సన్మానం..

లలితమ్మకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : 85%మంది కనీసం 65 సంవత్సరాల వయస్సు వచ్చేవరకే బ్రతికి ఉంటున్నారు. కానీ అందుకు భిన్నంగా న్యూ హోసింగ్ బోర్డు, వినాయక నగర్ లోని సూదిరెడ్డి లలితమ్మ 106 వయసులో కూడా తన పనులు తానే చేసుకుంటూ ఎవరి సహాయ సహకారాలు లేకుండా నడుస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది. శుక్రవారం వాకింగ్ కింగ్స్ గ్రూప్ సభ్యులలో ఒకరైన చిన్నా రెడ్డి అమ్మ అయిన లలితమ్మ ని వాకింగ్ కింగ్ పాదచారులు కలిసి శాలువాతో సన్మానించారు. తను గడుపుతున్న జీవన శైలిని అడిగి తెలుసుకున్నారు. ముని మనవళ్లు, మనవరాళ్లను చూస్తూ వాళ్ళతో గడుపుతున్న జ్ఞాపకాలను తెలిపారు. శనివారం జరుగబోయే తన మునిమనవరాలి నిశ్చితార్థం పాల్గొనుట చాలా ఆనందదాయకంగా ఉందని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -