Thursday, January 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ముంబైకారులైన మూలనివాసి మాలాజీకి సన్మానం

ముంబైకారులైన మూలనివాసి మాలాజీకి సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని అమీర్ నగర్ లో గురువారం ముంబై మహానగరంలో వలసవాదులుగా ఉంటున్న మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన మూలనివాసి మాలాజీని బహుజనవాది సామాజిక ఉద్యమకారుడు గుర్రం నరేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుర్రం నరేష్ మాట్లాడుతూ.. మూలనివాసి మాలాజీ ఏ సందర్భంలో నైన ముంబై నుంచి తెలంగాణకు వచ్చిన ప్రతిసారి ఏదోక బహుజనవాద కార్యక్రమాలు చేపడతారన్నారు. బుద్ధుడు, సావిత్రిమాయి పూలే, పెరియార్, అంబేడ్కర్, కాన్షిరాం లాంటి మహనీయులే గాకుండా అనేకమైన స్ఫూర్తిదాయక, ఆదర్శవంతమైన ఆచరణీయమైన బహుజనుల ఐక్యత కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ ఎస్సి ఎస్టీలను ఐక్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. మరుగున ఉన్న చరిత్రలను సమాజానికి తెలిసేటట్లు భావజాల కార్యక్రమాలు చేస్తున్నందుకు గుర్తింపుగా మూలనివాసి మాలాజీని సన్మానించినట్లు నరేష్  తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అంగుళి మాలజీ, మామిడి రాజు, గట్టు భరత్, బండి నారాయణ పద్మశాలి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -