నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని మునుకుంట్ల గ్రామ సర్పంచ్ గా నూతనంగా ఎన్నికైన గుల్లి నరేష్ ను గ్రామానికి చెందిన వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. నరేష్ తమ సంఘానికి ఉపాధ్యక్షులుగా పని చేస్తున్నారని, తమ సంఘానికి చెందిన నరేష్ సర్పంచ్ కావడం తమకు గర్వంగా ఉందని సభ్యులు తెలిపారు. ఆయనతోపాటు ఉప సర్పంచ్ గా ఎన్నికైన కడారి మల్లేష్ ను సన్మానించారు. గ్రామ అభివృద్ధి కొరకు అందరు కలిసి పని చేయాలని కోరారు. కార్యక్రమంలో 1వ వార్డు సభ్యురాలు ముడుసు నర్మదా, నాయకులు ముడుసు రామలింగయ్య, ముడుసు బిక్షపతి, యూత్ అధ్యక్షులు నూక బత్తిని కృష్ణంరాజు, చింతపెల్లి యాదగిరి, ముడుసు అనిత, కొంపెల్లి రవి, యాపాల సంతోష్ రెడ్డి, సైదులు,ముడుసు శంకర్,ముడుసు నరసింహ,ముడుసు ఉమాశంకర్, శ్రీశైలం, నూకబత్తిన క్రాంతి,బండ్ల అనిల్,అల్లి సుధాకర్,జలంధర్,అంజమ్మ,ఎల్లమ్మ,లలిత,యాదమ్మ,కనకమ్మ ఉన్నారు.
మునుకుంట్ల సర్పంచ్ నరేష్ కు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



