Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయులకు సన్మానం..

ఉపాధ్యాయులకు సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి : బామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రధాన సలహాదారులు గుగ్లోత్ సురేందర్  అదేశానుసరంగా గురు పౌర్ణమి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగంలో ఉపాధ్యాయులకు సన్మానం చేసినట్లు ఫౌండేషన్ ప్రధానకార్యదర్శి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు.  ప్రముఖ దేశ్ సేవక్మాల శెట్టి గారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన సూచించారు. ఉపాధ్యాయులు దేశ నిర్మాతలుగా ఎంతో మంది విద్యార్థుల జీవితాలని తీర్చి దిద్దుతున్నారని ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి తెలిపారు.  గురు స్థానంలో ఉన్న ఉపాధ్యాయులను గౌరవించడం  విద్యార్థి ప్రథమ కర్తవ్యం అన్నారు.

గురువును గౌరవించని వారు భవిష్యత్తులో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని ఉపాధ్యాయులు సూచించారు. ప్రపంచంలో ఒక వ్యక్తీ ఏ స్థాయిలో ఎదిగిన అది ఉపాధ్యాయుడి యొక్క ఘనత అని వారు తెలిపారు. బామన్ నాయక్ క్రీడా ఫౌండేషన్ పెద పిల్లలను ఉన్నత స్థాయిలో తీసుకెళ్లడానికి ఎన్నొ కార్యక్రమాలు చేపడుతుందని  నిర్వహకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ, రవికుమార్ గంగకుమార్ ,,రవి చంద్ర,శైలజ, గీత, లక్ష్మి, గోవర్ధన్ బండి రాజులు,లింగమయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -