నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ మహాసభ పలువురు నాయకులు, కార్యకర్తలతో పాటు పలు యుద్ధాల్లో మరణించిన వారికి సంతాపం తెలిపింది. ఐద్వా జాతీయ అధ్యక్షురాలు పీకే శ్రీమతి టీచర్ ఈ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, వెస్ట్‌బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, కమ్యూనిస్టు యోధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ సహా పలువురు ఐద్వా నాయకులు, ప్రజాసంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు, అభ్యుదయ రచయితలు, కళాకారులకు సంతాపం ప్రకటించారు. గాజాతో పాటు పలు యుద్ధాల్లో మరణించిన కుటుంబాలకూ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మహాసభ అమరులకు గౌరవసూచకంగా రెండు నిముషాలు మౌనం పాటించింది.



