- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
నిజామాబాద్ శివారులో గంజాయి స్మగ్లర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య శనివారం రాత్రి మృతి చెందడంతో సోమవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్న మద్యం గోదాంలో ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీధర్ ఎక్సైజ్ ఎస్సై బాలిశ్వరి సూపర్వైజర్ లచ్చయ్య ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేష్ రెడ్డి ప్రశాంతి సిబ్బంది శివకుమార్, మధు, విజయలక్ష్మి, ఇలియాజ్, వేణు హమాలీలు ఉన్నారు.
- Advertisement -



