నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన మాజీ ఎంపీపీ యల్లా రాములు 29వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డికి స్వయానా మేనమామ. 1995 మార్చి 18 నుంచి 1996 అక్టోబర్ 21 వరకు ఎంపీపీగా పని చేసినారు. ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రోటరీ క్లబ్ అధ్యక్షునిగా పనిచేస్తున్న సమయంలో పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని అన్నారు.
ప్రజా నాయకునిగా, పేద, బడుగు ,బలహీన వర్గాల కోసం రాజకీయంగా తన వంతు సేవ చేసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రక్కన ఆయన పేరుతో యల్ల రాములు మెమోరియల్ హాల్ సైతం నిర్మించినారు. అందరితో కలుపుగోలుగా ఉండే యల్ల హయాంలో మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చెందినట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీపీకి ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES