- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గరీబి హటావో నినాదంతో పేద ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ చేసిన సేవలను కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా నిలపడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కాంగ్రెస్ నేతలు  గోలి వెంకటరమణ,  ఆడెపు జగన్, దుబాల వెంకటేశం, వెంగళ అశోక్, శ్రీరాముల వెంకటేశం, వెంగళ లక్ష్మీ నరసయ్య, బొద్దుల శ్రీనివాస్, నేదురి లక్ష్మణ్, బూర యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    