నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాచారెడ్డి మండల మాజీ జడ్పిటిసి సభ్యురాలు గ్యార లక్ష్మి మృతి చెందడంతో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ఆమె స్వగ్రామం పోతారం గ్రామానికి వెళ్లిన ఆయన, గ్యార లక్ష్మి పార్తివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్యార లక్ష్మి జడ్పిటిసి సభ్యురాలిగా, మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ప్రజల మనస్సుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, పంపరి లక్ష్మణ్, కౌన్సిలర్ తాటి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమిల్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, సాయిబాబా, నాయకులు రాజశేఖర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.



