Sunday, March 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులకు ఘన నివాళులు

ఎస్సీ వర్గీకరణ పోరాట అమరులకు ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ అమరులకు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల కమిటీ అధ్యక్షుడు బొడ్డు శ్రవణ్ కుమార్  ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా అమలవుతున్న ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడిలుగా వర్గీకరించేందుకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

గత ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మాదిగలను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. గాంధీభవన్‌పై జరిగిన ఘటనలో ప్రమాదవశాత్తు 90 శాతం కాలిన గాయాలతో మృతి చెందిన ఎమ్మార్పీఎస్ యోధులు పొన్నాల సురేంద్ర మాదిగ, దామోదర్ మాదిగ, మహేష్ మాదిగలను, అలాగే హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా పోలీసుల లాఠీచార్జీలో గాయపడి మృతి చెందిన భారతి మాదిగను స్మరించుకుంటూ వారి త్యాగాలను మాదిగ జాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, మాదిగ దండోరా ఉద్యమంలో వేలాది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై నమోదైన కేసులను తక్షణమే కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికాముఖంగా కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మేడి యాదయ్య, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదర వెంకటేష్ మహజన్, మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు బోయ మల్లేష్, ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు సుక్క అర్జున్, మాదిగ సామాజిక ఉద్యమకారుడు కట్టెల లింగస్వామి, ఎంజెఎఫ్ మండల అధ్యక్షులు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు చీమకండ్ల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు దొనకొండ కిరణ్ కుమార్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాజ్ పేరియర్, విహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు గడ్డం ప్రభాకర్, బద్రి గాలయ్య, బోయ సృజన్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -