Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చిలుకు కిష్టయ్య తల్లికి నివాళులు

చిలుకు కిష్టయ్య తల్లికి నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య తల్లి అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు.ఈ సందర్భంగా ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలోని వారి నివాసంలో భౌతిక కాయానికి ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్  ఐనాల చైతన్య మహేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం చిలుకు కిష్టయ్య ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ  సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి ఓదార్పు చెప్పారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సిలివేరు బాలరాజ్, విట్టల్ నాయక్,శారాజీపేట సర్పంచ్ కంతి మధు, గ్రామ పెద్దలు మరియు స్థానిక నాయకులు పాల్గొని మృతురాలికి నివాళులు అర్పించారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -