నవతెలంగాణ – మిరుదొడ్డి
జనశక్తి నేత కామ్రేడ్ సంజీవ్ 19వ వర్ధంతిని పురస్కరించుకొని విరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో కుటుంబ సమేతంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుటుంబ సభ్యులు ప్రియాంక యాదగిరి మాట్లాడుతూ.. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పనిచేసి ప్రాణ త్యాగం చేసిన నాయకుడు సంజీవ్ అని అన్నారు. మా తండ్రి మరణం ప్రజాస్వామ్యానికి తీరనిలోటు అని తెలిపారు. ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం నిరంతరం ఎల్లవేళలా ఉంటూ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. పేద ప్రజలే లక్ష్యంగా పనిచేస్తారని వారు కోరారు. సంజీవ్ ఆశయాలు నెరవేర్చడానికి తమ వంతు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనశక్తి నేత కామ్రేడ్ సంజీవ్ కు ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES