Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీకాంతాచారికి ఘన నివాళులు

శ్రీకాంతాచారికి ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో శ్రీకాంతా చారి చిత్రపటానికి తెలంగాణ జాగృతి నాయకులు బుధవారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ జాగృతి నాయకులు అవంతి కుమార్  మాట్లాడుతూ..రనరాన తెలంగాణం.. ఈ దేహం తెలంగాణ తల్లికి అంకితమంటూ..ప్రత్యేక రాష్ట్ర సాధనకై తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించిన అమరు వీరుడు కాసోజు శ్రీకాంతా చారి వర్ధంతి నేడు అని తెలియజేశారు. 15ఏళ్ల క్రితం ఆయన చేసిన ఆత్మార్పణ దృశ్యాలు నేటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో జై తెలంగాణ నినాదాన్ని రగిలిస్తూనే ఉంటాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు శేఖర్ రాజు ,కరిపే రాజు ,మీసాల శంకర్ , ఎండల ప్రసాద్ , శ్రీనివాస్ గౌడ్ , సాయికృష్ణ, హరీష్ ,ఆకాష్ , వంశీ మరియు మహిళా జాగృతి నాయకులు శోభ, రేఖ , సరిత,రాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -