Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అమరులు సురవరం సుధాకర్ రెడ్డికి జోహార్లు

అమరులు సురవరం సుధాకర్ రెడ్డికి జోహార్లు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల నేడు సిపిఐ జిల్లా కార్యాలయంలో రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని తెలియచేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్యలు మాట్లాడుతూ.. అమరులు సురవరం సుధాకర్ రెడ్డి విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ లో చేరి విద్యారంగ సమస్యలపై తర్వాత కాలంలో యువజన కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహించి ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి కార్యదర్శిగా 1999,2004 నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2004 సంవత్సరంలో హైదరాబాద్లో జరిగిన విద్యుత్ ఉద్యమంలో తొలిదైన పాత్ర పోషించి విద్యుత్ చార్జీలు పెరగకుండా ఆపగలిగారని అన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో సమ సమాజం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రఘురాం,రంజిత్, హనుమాన్లు, సక్కిసురేష్,ఆలీ ఇమ్రాన్, ఫిరోజ్ ఆలీ, కుశాల్, టోకు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -