Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్ర‌జాక‌వి అందెశ్రీకి ఘన నివాళులు..

ప్ర‌జాక‌వి అందెశ్రీకి ఘన నివాళులు..

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
ప్ర‌జాక‌వి ర‌చయిత అందెశ్రీ మృతి ఎంతో బాధాకరం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన చిత్రపటానికి పూలువేసి అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు షేక్ ముబారక్, మాధవులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. అందెశ్రీ ప్రజాకళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని, వారు లేని లోటు పూడ్చలేనిదని తెలిపారు. ఆయన సాహితీ సంపద, ముఖ్యంగా జయ జయహే తెలంగాణ గీతం ఉన్నంత వరకు అందెశ్రీ మన గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారని పేర్కొన్నారు. సామాజిక రుగ్మ‌త‌ల‌ను రూపుమాపి, ప్ర‌జ‌ల్లో ప‌రివ‌ర్త‌న తీసుకువ‌చ్చే దిశ‌గా ప్ర‌భుత్వం కార్య‌చ‌ర‌ణ రూపొందిస్తున్న స‌మ‌యంలో అందెశ్రీ మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం భాధాక‌ర‌మ‌ని అన్నారు. రాష్ట్ర స్థాయి ప‌ద‌విని కూడా సున్నితంగా తిరస్క‌రించార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుఫ్, మల్లేష్, మహేష్, యాదగిరి నిరంజన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -