నవతెలంగాణ – గాంధారి
స్వాతంత్ర పోరాట యోధుడు తెలంగాణ సాయిధ పోరాటనీ సాగించిన మహనీయుడు మన కామ్రేడ్ సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గాంధారి మండల కేంద్రంలో సుందరయ్య గారి 40వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మోతి రామ్ నాయక్ మాట్లాడుతూ.. సుందరయ్య గారు 12 ఏళ్ల వయసు నుండి కుల వివక్షత మరియు దోపిడిని ఎదిరించినటు వంటి మహానీయుడు అన్నారు భూస్వామ్యం కుటుంబంలో పుట్టిన ఆయన కూలిపోరాటం భూస్వాములకు ఎదురు తిరిగి పోరాటం నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం లో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు సీపీఐ(ఎం) పార్టీ మొదటి ఆల్ ఇండియా కార్యదర్శిగా బాధ్యత వహించారు. పార్లమెంటుకు కూడా సైకిల్ పై వెళ్లి తన అణువైన బాధ్యత వహించినటువంటి నాయకుడుగా పేరుపొందినారు. అటువంటి నాయకుడు ఇప్పుడు ప్రజలకు అవసరం అన్నారు అకుంఠిత దీక్షతో పనిచేసిన నాయకుడే పేద ప్రజలకు మేలు చేయగలుగుతాడని అన్నారు అటువంటి మంచి పార్టీలు పనిచేయడం ఎంతో రుణపడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సరాబ్ కిషన్ రావు, మధు, గిరిజన సంఘం కార్యదర్శి ప్రకాష్ సాయిలు వసంతరావు ,రాములు ,స్వప్న, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.
పోరాట యోధుడు సుందరయ్యకు ఘన నివాళులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES