Monday, October 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వడ్డే ఓబన్నకు ఘన నివాళులు

వడ్డే ఓబన్నకు ఘన నివాళులు

- Advertisement -

స్థానిక సంస్థ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ లలో ఎ, బి, సి, డి వర్గీకరణ చేయాలి 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

మొదటితరం స్వాతంత్ర సమరయోధుడు, రేనాటి వీరుడు వడ్డే ఓబన్న 179 వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ప్రజాసంఘాల కార్యలయంలో ఓబన్న 179 వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథులు వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడ్డగొట్టి సాయిలు హజరై మాట్లాడుతూ.. స్వాతంత్రం కోసం తన మిత్రుడు అయిన ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి వడ్డే ఓబన్న బ్రిటిష్ వారితో చివరి శ్వాస వరకు విరోచితంగా పోరాడి 39 సంవత్సరాల వయస్సులోనే వీరమరణం చెందారు అని అన్నారు.

బానిసలుగా బ్రతుకుతున్న ప్రజలకు వడ్డే ఓబన్న పోరాటం నేటి తరాల వారికి స్ఫూర్తిదాయకం. నేడు వడ్డే ఓబన్న వర్ధంతి సందర్బంగా వారిని వారి ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. అనంతరం వడ్డెర వృత్తిదారుల సంఘం నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఇడ్డగొట్టి ఓడ్డెన్న మాట్లాడుతూ.. స్థానిక సంస్థ ఎన్నికల్లో బిసిలకు ఎ, బి, సి, డి వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. వడ్డెర వృత్తిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని కోరారు. వడ్డెర వృత్తిదారులకు భీమా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వడ్డెర వృత్తిదారులకు లోన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఎల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు కంది ఎల్లయ్య, దండువుల లింగం, గోగుల సాయిలు, తమ్మిశెట్టి సాయిలు, బోదాసు నారాయణ, గోగుల ఎల్లయ్య, బత్తుల వడ్డెన్న, నగేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -