Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పసరలో త్రివర్ణ పతాక ర్యాలీ

పసరలో త్రివర్ణ పతాక ర్యాలీ

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
మండలంలోని పస్రా గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మార్క సతీష్  ఆధ్వర్యంలో మంగళవారం తిరంగా ర్యాలీ నిర్వహించటం జరిగింది. ఈ ర్యాలీకీ ముఖ్య అతిధులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు సిరికొండ బలరాం  హాజరై మాట్లాడుతూ.. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ  దృడమైన సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వానికి, మన సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల యొక్క ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధూర్ గొప్ప విజయం సాధించిందిన్నారు. ఇది గొప్ప సుసంపన్నమైన, బలమైన ఆత్మ నిర్బర్ భారత్ కు నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం తర్వాత దేశ వ్యాప్తంగా ప్రజలు జాతీయ పతాకాన్ని చేతబూని దేశభక్తి కార్యక్రమాలను స్వచ్చందంగా నిర్వహాస్తున్నారు.

ప్రజలంతా చిన్న పెద్ద ధనిక, పేద అనే తేడా లేకుండా జాతీయ పతాకాన్ని (హర్ ఘర్ తిరంగా) కాలనీ లలో, పల్లే, పట్టణాల్లో ప్రతి ఇంటి పైన కట్టుకోవాలని, తద్వారా జాతీయవాద భావాన్ని కలిగి ఉండాలని, ఇటువంటి కార్యక్రమాలు మనలో ఐక్యతను కలిగి ఉండటానికి తోడ్పడుతుంది. ఈ భావన మన దేశ సమగ్రత, సమైక్యతను కాపాడుకోవడానికి ప్రతీకగా ఆకాంక్ష తో కలిగి ఉంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జినుకల క్రిష్నాకర్ రావు , జిల్లా కార్యదర్శి కొత్త సుధాకర్ రెడ్డి , మహిళా మోర్చా నాయకురాలు చందా జ్యోతి , ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి మేరుగు సత్యనారాయణ , కర్ర సాంబశివరెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి పసుల బాబురావు, వంగాల సోమిరెడ్డి , మంజ్యా నాయక్ , పూజరి శ్రీనివాస్, ఆకుల రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img