Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయం22న త్రైపాక్షిక సమావేశం..?

22న త్రైపాక్షిక సమావేశం..?

- Advertisement -

– ట్రంప్‌ యోచిస్తున్నట్టు లీకులు
– నేడు జెలెన్‌స్కీతో భేటీ
వైట్‌హౌస్‌:
ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలకడంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అలస్కాలో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే పుతిన్‌ తన వైఖరేంటో స్పష్టం చేశారు. యుద్ధం ముగించాలంటే తూర్పున ఉన్న దొనెట్‌స్క్‌ ప్రాంతం నుంచి ఉక్రెయిన్‌ పూర్తిగా వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై పుతిన్‌ కరాఖండిగా చెప్పాక… అప్పటి వరకూ హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడికి ఏం చేయాలో పాలుపోయలేదు. దీంతో మరోసారి భేటీ అవుదామని ట్రంప్‌ ప్రకటిం చారు. అనంతరం త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం గురించి ట్రంప్‌, జెలెన్‌స్కీలు ఫోన్‌లో మాట్లాడుకొన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య ఈ సమావేశం ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్టు ఆ దేశ మీడియా సంస్థలు లీకుల వదులుతు న్నాయి. పుతిన్‌తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని ట్రంప్‌ యూరోపియన్‌ నాయకులతో చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ట్రంప్‌తో భేటీ అవ్వనున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్‌ దేశాల నాయకులను కూడా ట్రంప్‌ ఆహ్వానిం చినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. జర్మన్‌ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య సమావేశం జరిగిన అనంతరం ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక మీటింగ్‌ జరిగే అవకాశం ఉందని వివరించారు. యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.
ఒప్పందంపై నిర్ణయం జెలెన్‌స్కీ చేతుల్లోనే ఉందన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు తనతో ఫోన్‌లో మాట్లాడినట్టు ఉక్రెయిన్‌ అధినేత తెలిపారు. త్రైపాక్షిక సమావేశంపై ట్రంప్‌ చేసిన ప్రతిపాదనకు తాను మద్దతిస్తున్నట్టు వెల్లడించారు. కీలక అంశాలపై చర్చించు కునేందుకు అది మంచి వేదిక అవుతుం దన్నారు. పరిస్థితులను చక్కదిద్దే బలం అమెరికాకు ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. శాంతి ఒప్పందంపై ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్న యూరో పియన్‌ నాయకులకు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad