Sunday, January 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'త్రిముఖ' రిలీజ్‌కి రెడీ

‘త్రిముఖ’ రిలీజ్‌కి రెడీ

- Advertisement -

యోగేష్‌ కల్లె హీరోగా, సన్నీ లియోన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘త్రిముఖ’. అకృతి అగర్వాల్‌, జక్ష్మీణ ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్‌, ఆశు రెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్‌, షకలక శంకర్‌, సుమన్‌, రవి ప్రకాష్‌, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఖిరా డ్రీమ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్‌ మద్దాలి నిర్మిస్తున్నారు. రాజేష్‌ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా రానున్న ఈ సినిమాని ఈ నెల 30న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేయ నున్నారు. తాజాగా ఈ సినిమా డేట్‌ అనౌన్స్‌మెంట్‌ ప్రెస్‌మీట్‌ ఫిలింఛాంబర్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా నటి సాహితీ దాసరి మాట్లాడుతూ, ‘థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే చిత్రమిది. నేనొక ఇంపార్టెంట్‌ రోల్‌ చేశాను. ఆ క్యారెక్టర్‌ ఏంటి అనేది ఇప్పుడు రివీల్‌ చేయలేం’ అని తెలిపారు. ‘ఒక మంచి కథతో, బలమైన స్క్రీన్‌ ప్లే తో ఈ చిత్రాన్ని రూపొందించాను. మూవీ ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. సెకండాఫ్‌ తల పక్కకు తిప్పనంతగా ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ప్రతి పాత్ర ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుంది. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఉంటుంది’ అని డైరెక్టర్‌ రాజేశ్‌ నాయుడు చెప్పారు. హీరో యోగేష్‌ కల్లె మాట్లాడుతూ,’ హీరోగా నా ఫస్ట్‌ మూవీ. కామెడీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్న కథతో ఒక కొత్త ప్రయత్నం చేశాం. మంచి కథా కథనాలతో సినిమాను రూపొందించారు మా డైరెక్టర్‌ రాజేశ్‌. అందర్నీ అలరించే సినిమా ఇది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -