రోడ్డుపై బాధిత రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-సంస్థాన్ నారాయణపురం
త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని పుట్టపాక, సర్వేలు, లింగారెడ్డిగూడెం గ్రామాల రైతులు సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని దేవిరెడ్డి గూడెం వద్ద రోడ్డుపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతు లు, రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కిలోమీటర్ల దూరంలో నిర్మించాల్సిన త్రిబుల్ ఆర్‌ను చౌటు ప్పల్‌లోని దివిస్ కంపెనీ, కొంతమంది పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 28, 30 కిలోమీటర్లలోపు నిర్మించేందుకు తీసు కొచ్చిందన్నారు. ఆ అలైన్‌మెంట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కంపెనీల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదని విమర్శించారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే దివిస్ కంపెనీ యాజమాన్యం పెట్టే ఎంగిలి మెతుకుల కోసం త్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చారంటూ ఆరోపించారు.పుట్టపాక, సర్వేలు, లింగవారిగూడెం గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల రైతుల పట్టా భూములు పోతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు దివిస్‌ను పారదోల్తామని చెప్పిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి గెలిచాక రైతులనే పారద్రోలే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రాణం పోయినా తమ భూములను వదులుకోబోమన్నారు. నల్లగొండలో మంత్రి వెంకట్‌రెడ్డిని కలిసి తమ గోడు వినిపించుకునేందుకు వెళ్తే పోలీసు లు అడ్డుకోవడం దారుణన్నారు. తమ ఆవేదన చెప్పేందుకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని కలిస్తే.. ఉత్తరభాగం మారాలంటే ముందు దక్షిణ భాగం మారాలని.. ఈ రెండు మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అని చెప్పుకొచ్చారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకులు దోనూరు నర్సిరెడ్డి, దొంతగాని పెద్దులు అన్నారు. కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాస్తా రోకోలో బద్దుల వెంకటయ్య, నాగార్జున, పలువురు రైతులు పాల్గొన్నారు.
త్రిబుల్ ఆర్ అలైన్‌మెంట్ మార్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES