Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్టోబర్ 6న త్రిబుల్ ఆర్ బాధితులు చలో హైదరాబాద్

అక్టోబర్ 6న త్రిబుల్ ఆర్ బాధితులు చలో హైదరాబాద్

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
అక్టోబర్ 6న తలపెట్టిన హైదరాబాద్ హెచ్ఎండిఏ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని త్రిబుల్ ఆర్ బాధితులు అధిక సంఖ్యలో పాల్గొనాలని త్రిబుల్ ఆర్ బాధితుల చౌటుప్పల్ మండల కన్వీనర్ డబ్బేటి రాములు గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ని ఎత్తివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రాములు డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలని లేదా బహిరంగ మార్కెట్ రేటు మూడింతలు ఇవ్వాలని,భూమి కోల్పోతున్న రైతులకు HMDA పరిధిలో 2000 గజాల ప్లాట్లు ప్రభుత్వం కేటాయించాలని రాములు డిమాండ్ చేశారు. కావున భూ బాధితులు అందరు పెద్ద ఎత్తున అక్టోబర్ అరుణ హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్యాలయాన్ని దిగ్బంధం చేయాలని రాములు పిలుపునిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -