నవతెలంగాణ హైదరాబాద్: సురక్షితమైన, విశ్వసనీయమైన కమ్యూనికేషన్ కొరకు ప్రపంచ ప్రసిద్ధి పొందిన ట్రూకాలర్, ఈరోజు 500 మిలియన్ యూజర్ సంఖ్యను అధిగమించిందని ప్రకటించింది. కమ్యూనికేషన్ లో నమ్మకాన్ని ఏర్పరచాలనే కంపెనీ యొక్క లక్ష్యములో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ ప్లాట్ఫార్మ్ గణనీయమైన యూజర్ వృద్ధిని చూస్తూనే ఉంది. 2025లోనే 50 మిలియన్ యూజర్లు చేరారు.
“ఇది మాకు ఎంతో ముఖ్యమైన మైలురాయి, కాని ఇది మనము నివసిస్తున్న ప్రపంచము గురించి మనలను హెచ్చరిస్తుంది,” అని రిషిత్ ఝున్‌ఝున్‌వాలా, సీఈఓ, ట్రూకాలర్ అన్నారు. “ఈనాడు స్పామ్, స్కామ్, అవాంఛనీయ కమ్యూనికేషన్ ను ఎదుర్కొనుటకు చాలామందికి సహాయం అవసరం అవుతోంది. 500 మిలియన్ యూజర్లను చేరుకోవడం అనేది ఈ అవసరం యొక్క పరిధిని మరియు కమ్యూనికేషన్ ను సురక్షితం చేయడములో సహాయం కోసం ప్రజలు ట్రూకాలర్ పై ఉంచిన నమ్మకాన్ని తెలుపుతోంది. ప్రతి కాల్ లేదా సందేశము ముందు, ఆ సమయములో, ఆ తరువాత యూజర్లను రక్షించే ఆధునిక సాంకేతికత మరియు కొత్త సామర్థ్యాలతో ట్రూకాలర్ ను బలోపేతం చేయడముపై మా నిబద్ధత ఉంటుంది. అంతిమంగా, ప్రతి ఒక్కరికి ఒక సురక్షితమైన, మరింత విశ్వసనీయమైన కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్మించడం మా లక్ష్యం. ఇప్పుడు తరువాత మైలురాయిని సెట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము: 1 బిలియన్ యూజర్లు. ప్రతి నెల 50 కోట్లకు పైగా యూజర్లు ఈ ప్లాట్ఫార్మ్ ను ఉపయోగిస్తుండగా, ట్రూకాలర్ కేవలం ఒక కాలర్ ఐడెంటిఫికేషన్ అప్లికేషన్ గా మాత్రమే కాకుండా అంతకు మించి పరిణామం చెందింది. ఇది డిజిటల్ యుగములో కమ్యూనికేషన్ ఏ విధంగా సురక్షితంగా పనిచేస్తుంది అనే దానిలో ఒక భాగం అయింది. గుర్తింపులను ధృవీకరించుకునేందుకు, మోసాన్ని నివారించుటకు మరియు వారు ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నారు అనేది తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవడములో ప్రజలకు సహాయం చేసే ఒక నమ్మకం.ఈరోజు, లక్షలాది ప్రజలకు ప్రతిరోజు కమ్యూనికేషన్ అలవాట్లలో ఒదిగిపోయి, ట్రూకాలర్ ఒక ప్రపంచవ్యాప్త డిజిటల్ యుటిలిటి ప్లాట్ఫార్మ్ గా పనిచేస్తోంది. తెలియని కాలర్స్ ను గుర్తించడము నుండి మోసాన్ని నివారించడం మరియు సురక్షితమైన మెసేజింగ్ అనుకూలపరచడం వరకు, ఈ ప్లాట్ఫార్మ్ ఫోన్ ఎకోవ్యవస్థలో సురక్షితమైన ఇంటరాక్షన్లకు సహకరించే ఒక అలవాటైన, రోజూ-వినియోగించే సేవ అయింది. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు పైగా యూజర్లకు సేవలందించినప్పటికీ, కంపెనీ సుమారు 470 ఉద్యోగుల బృందముతో ప్రపంచములోని యూజర్ల కోసం ప్లాట్ఫార్మ్ ను నిర్మించడము మరియు నిర్వహించడానికి కృషిచేస్తూ సాపేక్షంగా సన్నగా ఉండిపోయింది. కంపెనీ తన మధ్యంతర నివేదికలకు సంబంధించి త్రైమాసికంగా నెలవారి, రోజువారి క్రియాశీలక యూజర్ల సగటు సంఖ్య గురించి తెలియజేస్తుంది.



