ఈ శీర్షికన విద్యార్థినుల ఫొటోలను ఫస్ట్‌పేజీలో ముద్రించిన టెహ్రాన్ టైమ్స్
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగు తున్నాయి. యుద్ధంలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తూనే ఉన్నాయి. యుద్ధంలో అమా యకులైన పౌరులు ప్రాణాలు కోల్పో తుండ డంపై అంతర్జాతీయంగా ఆందోళ నలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌కు చెందిన టెహ్రాన్ టైమ్స్ వెలు వరించిన కథనం ప్రపంచదృష్టిని ఆకర్షిం చింది. యుద్ధం ప్రారంభం రోజే ఇరాన్‌లోని మినాబ్‌లో పాఠశాలపై జరిగిన దాడిలో 150 మందికిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పో యిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిన్నారుల ఫొటోలను ఆ పత్రిక మొదటి పేజీలో సోమవారం ప్రచురించింది.
”ట్రంప్ ఒక్కసారి ఆ చిన్నారుల కండ్ల ల్లోకి చూడు” అంటూ చిన్నారుల ఫొటో లను పత్రిక మొదటి పేజీలో వేసింది. వందలాది మంది ఇరాన్ పిల్లలు అమెరికా దాడుల్లో మరణించినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు మాత్రం మినాబ్ దాడిని అంగీ కరించడం లేదంటూ టెహ్రాన్ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అమెరికా క్షిపణి దాడుల్లో చిన్నారులు మరణించారని ఇరాన్ పేర్కొం టుండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆ నెపాన్ని ఇరాన్‌పైకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్ ఆయుధాలకు కచ్చితత్వం ఉండదంటూ, మినాబ్ పాఠశాల దాడి ఘటనకు ఆ దేశానిదే బాధ్యతంటూ మీడియా సమావేశంలో ట్రంప్ పేర్కొనడం గమ నార్హం. ఈ నేపథ్యంలో ఫొటోలతో బదు లిచ్చింది. మరోవైపు టెహ్రాన్ టైమ్స్ పోస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. జీవితంలో ఎన్నో చూడాల్సిన పసిమొగ్గలు చిరుప్రాయంలోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమంటూ కొందరు భావో ద్వేగంతో పోస్టులు పెడుతున్నారు. ఈ దాడికి కారణ మైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, క్షిపణులు తయారుచేసిన వారు, దానికి సాంకేతిక సాయం అందించిన అందరూ బాధ్యులే నంటూ మరో యూజర్ పోస్ట్ చేశారు. దాడికి వెంటనే ముగింపు పలకా లంటూ మరో యూజర్ విజ్ఞప్తి చేశారు. అయితే, ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందో ళనల్లో మరణించిన వారి మాటేంటి? అంటూ మరికొందరు యూజర్లు ప్రశ్నిస్తున్నారు.
‘ ట్రంప్.. ఆ చిన్నారుల కండ్లల్లోకి చూడు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



