Monday, March 9, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు

ట్రంప్‌ మూల్యం చెల్లించుకోక తప్పదు

- Advertisement -

ఖమేనీ హత్యపై ఇరాన్‌
టెహ్రాన్‌ :
ఇరాన్‌ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీపై దాడి, హత్యకు అమెరికా అధ్య క్షుడు ట్రంప్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజాని హెచ్చ రించారు. ఖమేనీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఆయన.. తమ నాయకుడి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
‘మేం ట్రంప్‌ను వదిలిపెట్టం. ఖమేనీ హత్యకు ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. దాడుల్లో మా నాయకుడితో సహా అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది సాధారణ విషయం కాదు. దీనికి తగిన రీతిలో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. ఈ సందర్భంగా యుద్ధం నేపథ్యంలో అనేక మంది అమెరికన్‌ సైనికులను తాము బంధించామని అలీ మరో పోస్టులో పేర్కొన్నారు. వారిని జైళ్లలో ఉంచినట్టు తెలిపారు. ఇరాన్‌ దాడుల్లో ఆరుగురు యూఎస్‌ సైనికులే ప్రాణాలు కోల్పోయారంటూ ట్రంప్‌ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని, వాస్తవానికి చాలా మందే చనిపోయారన్నారు. కొన్ని రోజుల తర్వాత ప్రమాదాలు, కల్పిత సంఘటనలతో మృతుల సంఖ్యను పెంచేస్తారని ఆరోపించారు.
ప్రస్తుత పరిస్థితులపై లారిజాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోని యూఎస్‌ బలగాలు బందీగా తీసుకెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. వెనిజులా లో మాదిరిగా ఇరాన్‌లోనూ త్వరగా యుద్ధం ముగించేయాల నుకున్నారని.. కానీ, అది విఫలమైందని అన్నారు. అయితే, యూఎస్‌ సైనికులను బంధించామంటూ లారిజాని చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇవి ఆ దేశ ప్రభుత్వ అబద్ధాలు, మోసాలకు మరో నిదర్శనం అని సెంటాకామ్‌ ప్రతినిధి మీడియాతో అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -