ఘర్షణలో తలదూర్చబోనని స్పష్టీకరణ
వాషింగ్టన్ : పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలో తలదూర్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు. పాకిస్తాన్‌తో తనకు బలమైన సంబంధాలు ఉన్నాయని, ఆ దేశం పనితీరు చాలా బాగుంద ని వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘నేను పాకిస్తాన్‌తోనే ఉన్నాను. వారికి ఓ గొప్ప ప్రధాని, ఓ గొప్ప సైనాధ్యక్షుడు ఉన్నారు’ అని విలేకరులతో అన్నారు. వారిద్దరినీ తాను ఎంతగానో గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. కాగా పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం ఇది మొదటిసారి కాదు. పాక్ ప్రధాని, సైన్యాధ్యక్షుడు గొప్పవారని, అపురూపమైన వ్యక్తులని గతంలో అన్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య గత కొద్ది రోజులుగా ఉద్రిక్తతలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇరు పక్షాలకూ చెందిన సైనికులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 26న సరిహద్దుల వెంబడి కాల్పులు జరగడంతో ఘర్షణలు చెలరేగాయి.
పాక్ నేతలు గ్రేట్ : ట్రంప్ ప్రశంసలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



