– రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్
చెన్నై : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల పాటు భారత్‌కు అనుమతి ఇస్తున్నట్టు అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామంపై నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ తీవ్రస్థాయిలో స్పందించారు.”మేం స్వేచ్ఛాయుత, సార్వభౌమ దేశానికి చెందిన పౌరులం. మాకు విదేశాల నుంచి ఆదేశాలు అక్కర్లేదు. మీ సామర్థ్యాల మేరకు మీ పని మీరు చూసుకోండి” అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు సూచించారు. సార్వభౌమ దేశాలు పరస్పరం గౌరవించుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్టు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ పేర్కొన్న నేపథ్యంలో కమల్ హాసన్ ఈ విధంగా స్పందించారు.
ట్రంప్‌జీ.. మీ పని మీరు చూసుకోండి
- Advertisement -
- Advertisement -



