నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు బంపరాఫర్ ప్రకటించారు. యూఎస్ లో 51వ రాష్ట్రంగా ఆ దేశం విలీనమైతే..గొల్డ్‌న్ డోమ్ ఫ్రీగా ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా USD 61 బిలియన్లు అందజేస్తామని ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ పామ్ ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత కెనడాను యూఎస్ లో విలీనం చేస్తామని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ట్రంప్ తాజాగా మరోసారి కెనడాకు భారీ ఆపర్ ఇచ్చారు. అంతేకాకుండా యూఎస్ ప్రెసిడెంట్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్‌లో ఆదేశంపై కూడా సుంకాల మోత మోగించారు. ఆటో మొబైల్ రంగాన్ని టార్గట్ చేస్తూ 25శాతం ప్రతీకార సుంకాలు విధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. యూఎస్ ప్రతీకార చర్యలకు తలొగ్గే పరిస్థితిలేదని విక్టరీ సభలో ఆయన ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు.
అమెరికాకు 17 లక్షల కోట్ల రూపాయలతో (175 బిలియన్ డాలర్లు) ‘గోల్డెన్ డోమ్’ను నిర్మిస్తున్నట్లు మే21న ట్రంప్ ప్రకటించారు. రక్షణ వ్యవస్థ కోసం అంతరిక్షంలో (స్పేస్) ఆయుధాన్ని మోహరించే తొలి దేశంగా అమెరికా నిలుస్తుంది. ట్రంప్ పదవి పూర్తయ్యే లోపు అంటే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు. గోల్డెన్ డోమ్ అనేది అత్యాధునిక రక్షణ వ్యవస్థ. భూమిపైనే కాకుండా అంతరిక్షం (స్పేస్) లో ఏర్పాటు చేసిన షీల్డ్ (కవచం). మిస్సైల్స్, డ్రోన్స్ ను గుర్తించి వెంటనే టార్గెట్ చేసి కూల్చేసే సామర్థ్యం ఉంటుంది. అవి భూమిని చేరకముందే గాలిలోనే.. ఆకాశంలోనే కూల్చేస్తుంది ఈ డోమ్ డిఫెన్స్ సిస్టం.