Friday, July 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఐదు రోజుల్లో ముగియ‌నున్న టారిఫ్‌లపై ట్రంప్ డెడ్‌లైన్

ఐదు రోజుల్లో ముగియ‌నున్న టారిఫ్‌లపై ట్రంప్ డెడ్‌లైన్

- Advertisement -
  • ఆగస్టు 1 నుంచి ప్ర‌తీకార సుంకాల మోత‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్‌లపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.

అయితే తాజాగా డెడ్‌లైన్ దగ్గర పడుతుండడంతో ఆయా దేశాలకు అమెరికా లేఖలు పంపిస్తోంది. ఇదే అంశంపై విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారు. ఆగస్టు 1 నుంచి వాణిజ్య దేశాలు సుంకాలు చెల్లించాల్సిందేనని.. ఈ మేరకు శుక్రవారం నుంచి లేఖలు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో అయితే అదనపు లేఖలు కూడా వస్తాయని పేర్కొ్న్నారు. వాణిజ్య భాగస్వామ దేశాలకు సుంకాల రేట్లను తెలియజేస్తూ లేఖలు ప్రారంభించినట్లు వెల్లడించారు. శుక్రవారం 10-12 దేశాలకు లేఖలు అందుతాయని.. 60-70 శాతం, 10-20 శాతం వరకు సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు. జూలై 9లోగా దేశాలు ఒప్పందాలు చేసుకోకపోతే అధిక రేట్లు విధిస్తామంటూ గతంలోనే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటి వరకు యూకే, వియత్నాం ఒప్పందాలు చేసుకున్నాయి.

మ‌రోవైపు భారతదేశంతో అమెరికా ఒప్పందాన్ని కుదుర్చుకోగలదని ట్రంప్ తెలిపారు. ఇరు దేశాలు సుంకాలు తగ్గిస్తాయని.. దీంతో 1.4 బిలియన్ వినియోగదారులు భారత్ మార్కెట్లో అమెరికన్ కంపెనీలు పోటీ పడటానికి సహాయపడుతుందని చెప్పారు.

సోయాబీన్స్, గోధుమలు, మొక్కజొన్న, ఆపిల్స్, ఇథనాల్, పాల ఉత్పత్తులు వంటి అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడం ద్వారా భారతదేశం తన దేశీయ మార్కెట్‌ను గణనీయంగా ప్రారంభించగలదని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అయితే వీటిలో చాలా వరకు భారతదేశంలో రాజకీయంగా సున్నితమైనవి. జన్యుపరంగా మార్పు చెందిన పంటలకు సులభమైన మార్కెట్ యాక్సెస్‌ను వాషింగ్టన్ డిమాండ్ చేసింది. అయితే ఆరోగ్యం మరియు నియంత్రణ సమస్యల కారణంగా ఢిల్లీ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం జరుగుతుందా? లేదా? అన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -