– 20వేల కోట్ల డాలర్లకు పైగా విలువైన ఒప్పందాలు : వైట్‌హౌస్ ప్రకటన
వాషింగ్టన్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో అమెరికా సంబంధాలు మరింత బలపడ్డాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ దేశంతో 20వేల కోట్ల డాలర్లకు పైగా విలువైన ఒప్పందాలను చేసుకున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. అలాగే కృత్రిమ మేథస్సు రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కూడా ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. జీఈ ఏరోస్పేస్ తయారు చేసిన ఇంజన్లతో నడిచే 28 బోయింగ్ 787, 777ఎక్స్ విమానాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఇతిహాద్ ఎయిర్‌వేస్ నుండి వచ్చిన హామీ కూడా ఈ ఒప్పందాల్లో వుంది. తదుపరి తరం 777ఎక్స్ విమానాన్ని తమ వైమానికదళంలో చేర్చుకుంటుండడంతో ఈ పెట్టుబడుల వల్ల యూఏఈ, అమెరికా మధ్య శాశ్వత వాణిజ్య పౌర విమానయాన భాగస్వామ్యం కూడా బలపడుతోందని వైట్‌హౌస్ పేర్కొంది. రెండు దేశాలు ఏఐ యాక్సిలరేషన్ పార్టనర్‌షిప్‌కు సంబంధించి ఒక చట్రపరిధిని కూడా ఏర్పాటు చేసుకునేందుకు అంగీకరించారని అమెరికా వాణిజ్య శాఖ తెలిపింది. అమెరికా వెలుపల అతి పెద్దదైన 5జిడబ్ల్యు ఎఐ కేంపస్‌ను ఆవిష్కరించే కార్యక్రమానికి ట్రంప్, షేక్ మహ్మద్‌లు హాజరయ్యారు. ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ఈ ఒప్పందం అటు అమెరికాతో పాటు ఇటు యుఎఇకి కూడా విజయమే. ప్రధాన చమురు ఉత్పత్తిదారైన యూఏఈ అంతర్జాతీయంగా ఏఐ శక్తిగా ఆవిర్భవించేందుకు కోట్లాది డాలర్లను ఖర్చు చేస్తోంది. అయితే చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా వున్నందున బైడెన్ హయాంలో అమెరికా చిప్‌లకు పరిమితంగానే సౌలభ్యం వుండేది.
యూఏఈతో ట్రంప్ డీల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES