కమ్యూనిస్టులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. కమ్యూ నిస్టులపై తనకున్న అక్కసును వెళ్లగక్కారు. ‘కమ్యూనిస్టు పిచ్చోడు’ అని పేర్కొంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించలేదు. అయితే ఆయన చేసిన ఈ కామెంట్ న్యూయార్క్ మేయర్ డెమొక్రాటిక్ అభ్యర్థి మమ్దానీని ఉద్దేశించేనని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ట్రంప్ రాసిన పోస్టులో ”ప్రశాంతంగా ఉండండి. నా దగ్గర అన్ని పనిముట్లు, కార్డులు ఉన్నాయి. న్యూయార్క్ నగరాన్ని కాపాడతాను. దానిని మళ్ళీ హాట్ అండ్ గ్రేట్‌గా మారుస్తా” అని రాసుకొచ్చారు. మమ్దానీ ఇటీవల న్యూయార్క్ నగర మేయర్‌గా గెలిచిన డెమొక్రటిక్ అభ్యర్థి మమ్దానీని ట్రంప్ మద్దతుదారులు వివాదంలోకి లాగారు. మమ్దానీ అమెరికన్ పౌరసత్వాన్ని రద్దు చేయాలనీ, దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
టార్గెట్ వెనుక..
33 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ డెమొక్రటిక్ అభ్యర్థిగా న్యూయర్క్ మేయర్‌గా ప్రైమరీలో విజయం సాధించారు. అప్పటి నుంచి ట్రంప్ ఆయనపై మాటల దాడిని తీవ్రం చేశారు. మమ్దానీని ‘కమ్యూనిస్ట్, అసమర్థుడు, ప్రమాదకరమైన నాయకుడు’ అని ప్రచారం చేస్తున్నాడు. అదే సందర్భంలో అక్రమ వలసదారుల్ని అరెస్టు చేయకుండా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)ను ఆపేయాలని మమ్దానీ చెప్పడాన్ని ట్రంప్ తీవ్రంగా తప్పుపడు తున్నారు. ఫెడరల్ ఏజెన్సీల నిబంధనలు పాటించకపోతే, అరెస్టు చేయాల్సి ఉంటుం దంటూ హెచ్చరిక చేశారు. అమెరికాలో కమ్యూనిస్టులు వద్దనీ, అలాంటి కార్యకలాపాలను తాను నిశితంగా గమనిస్తానంటూ సోషల్ మీడియా ఖాతా ట్రూత్‌లో పోస్టులు పెట్టారు.
నియంతృత్వం మమ్దానీ ట్రంప్ బెదిరింపులను జోహ్రాన్ మమ్దానీ
తిప్పికొట్టారు. ఆయనది నియంతృత్వమనీ, తాను భయపడబోనని స్పష్టం చేశారు. తనను అమెరికా అధ్యక్షుడు అరెస్టు చేస్తాననీ, పౌరసత్వాన్ని తొలగిస్తాననీ, నిర్బంధ శిబిరంలో ఉంచుతాననీ, బహిష్కరిస్తానని బెదిరించారని చెప్పారు. కేవలం న్యూయార్క్ సిటీ ప్రజల్లో భయాన్ని వ్యాప్తి చేయడం కోసమే ట్రంప్ ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎవరీ జోహ్రాన్ మమ్దానీ?
జోహ్రాన్ మమ్దానీ భారతీయ-అమెరికన్ చలన చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు. అతను ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. భార్య రామా దువాజీ సిరియన్ మూలానికి చెందిన కళాకారిణి. ఆమె 2018లో అమెరికా పౌరసత్వం పొందింది. ఆమె 2021 నుంచి న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలుగా ఉన్నారు, మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికలకు డెమొక్రాటిక్ ప్రైమరీలో గెలవండంతో ట్రంప్ దృష్టి ఆయనపై పడింది. అప్పటి నుంచి నయానా భయానా మమ్దానీని హెచ్చరిస్తూనే ఉన్నారు.
ట్రంప్ నోటిదురుసు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES