యూఎస్ ట్రెజరీ శాఖ కీలక ప్రకటన
165 ఏండ్ల సంప్రదాయానికి బ్రేక్
వాషింగ్టన్: ఇకపై అమెరికాలో ముద్రించనున్న అన్ని కరెన్సీ నోట్లపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారు. ఈ మేరకు అమెరికా ట్రెజరీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ దేశ 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని యూఎస్ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. 1861 నుంచి అమెరికా కరెన్సీ నోట్లపై ట్రెజరర్, ట్రెజరీ కార్యదర్శి సంతకం ఉండడం సంప్రదాయంగా వస్తోంది. ప్రస్తుత నిర్ణయంతో 165 ఏండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ట్రంప్ ప్రభుత్వం ముగింపు పలికినట్టైంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ట్రెజరీ శాఖ ప్రకటన ప్రకారం.. కొత్త డిజైన్‌తో విడుదలయ్యే నోట్లపై 2026 చివరి త్రైమాసికం నుంచి ట్రంప్ సంతకం కనిపించనుంది.
ఈ మార్పు అమెరికా కరెన్సీకి ‘జాతీయ గుర్తింపు, నాయకత్వ ప్రతీక’గా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. అయితే, విమర్శకులు మాత్రం ఈ నిర్ణయాన్ని రాజకీయీకరణగా అభివర్ణిస్తూ, కరెన్సీ వ్యవస్థను అధ్యక్షుడి వ్యక్తిగత బ్రాండింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం ఉన్న నోట్లను ప్రజలు ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటారన్న దానిపై ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించలేదు. కానీ కొత్త నోట్ల ముద్రణకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమైనట్లు ట్రెజరీ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం అమెరికా కరెన్సీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికినట్టైంది.
అమెరికా కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



